Saturday, June 22, 2024

భర్తలను వదిలేసి ఇద్దరు వివాహితలు సహజీవనం

spot_img

ఒకరంటే ఒకరికి ఇష్టం. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఉన్న ఊరిని వదిలి వేరే గ్రామానికి వెళ్లి కలిసి బతుకుతున్నారు.ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇద్దరూ మహిళలే. అంతేకాదు వారిద్దరికి పెళ్లయి..పిల్లలు కూడా ఉన్నారు. ఈ వింతైన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది.

కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ఓ గిరిజన గూడేనికి చెందిన ఇద్దరు పెళ్లైన మహిళలు గ్రామం నుంచి పరారయ్యారు. వారిలో ఒక మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళకు భర్త, కొడుకు ఉన్నాడు. అయితే ఇటీవల అనారోగ్యంతో కొడుకు మృతిచెందాడు. కాగా…వీళ్లిద్దరూ ఆరునెలల క్రితం గ్రామం నుంచి పరారై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల ప్రాంతంలో రహస్యంగా జీవిస్తున్నారు.

ఒకరు పురుషుడిలా.. మరొకరు మహిళలా ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరి భర్త …భార్య కోసం వెతుక్కుంటూ సరిగ్గా వారు ఉండే ప్రాంతానికే వెళ్లాడు. అక్కడ వారిద్దని చూశాడు. ఐదు రోజుల క్రితం వారిని గ్రామానికి తీసుకొచ్చి స్థానికుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయినా, వారు పెద్దమనుషుల మాటను లెక్క చేయకుండా తమకు నచ్చిన విధంగా ఉంటామని తేల్చిచెబుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులో పడిపోయారు గ్రామ పెద్దలు. ప్రస్తుతానికి ఆ మహిళలిద్దరూ అదే గ్రామంలోని తమ తల్లిగారి ఇండ్లల్లో ఉన్నారు.

ఇది కూడా చదవండి:గ్రూప్‌ -1అభ్యర్థులకు ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు

Latest News

More Articles