Sunday, May 12, 2024

మాటల సీఎం..చేతల్లో ఉత్తిదే..అందని ద్రాక్షగానే ఒకటో తేదీన జీతాలు..!!

spot_img

మాటల సీఎం..చేతల్లో సీఎం కాదని మరోసారి రుజువు చేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటో తేదీనే వేతనాలు వేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. కొత్త సర్కార్ కొలువదీరి మూడు నెలలు గడిచినా ఒకటో తేదీన జీతాలు అందని ద్రాక్షాలనే మారింది. లైబ్రేరియన్లు దగ్గరి నుంచి నిరుద్యోగుల వరకు సకాలంలో వేతనాలు అందక ఇన్నో ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒత్తిళ్లు, విన్నపాలతో ప్రభుత్వం బుధవారం కొన్ని జిల్లాల్లో వేతనాలు విడుదల చేసింది. మూడు జిల్లాల్లోని ఉద్యోగులకు వేతనాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు ఇప్పటి వరకు అందలేదు.

టెస్కో ఇవ్వాల్సిన యూనిఫాం వస్త్రం కొనుగోలు అడ్వాన్సులు మళ్లీ డిసెంబర్ నెల వేతనాలు ఎలాగోలా సరిపెట్టేశారు. పోలీస్ శాఖలో ఈనెల 14,15 తేదీల్లో వేతనాలు అందజేశారు. హెల్త్ మిషన్ లో ఉద్యోగులకు ఇంకా జీతాలే అందలేదు. దాదాపు 10వేల మందికి ఇంకో నెల జీతం బకాయే ఉంది. ఇక ఫించన్ల సంగతి తెలిసిందే. గురుకులాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈనెల 16న వేతనాలు అందాయి. అర్చకులకు 20రోజుల ఆలస్యంగా వేతనాలు అందుతున్నాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలుగా జీతాల్లేవంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనంలో మా కుటుంబాలు సాగుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమం కోసం కష్టపడి పనిచేసే మాకు..వేతనాలు సరిగ్గా ఇవ్వకుంటే ఎలా బతికేది అంటూ వాపోతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వ తేదీలోపే జీతాలు అందిస్తుందని ఆశపడితే నిరాశే మిగిలిందంటున్నారు.

ఇది కూడా చదవండి: ఇంట్లోనే నార్మల్ డెలివరీ కోసం యత్నం: తల్లీబిడ్డ మృతి.

Latest News

More Articles