Sunday, May 19, 2024

ఇంట్లోనే నార్మల్ డెలివరీ కోసం యత్నం: తల్లీబిడ్డ మృతి.

spot_img

కేరళలోని తిరువనంతపురంలో విషాదం నెలకొంది. ఆక్యుపంక్చర్ వైద్యంతో ఇంట్లోనే బిడ్డను కనాలని ప్రయత్నించిన ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. 36ఏళ్ల గర్బిణీ షెమీరా బీవీ ఆక్యుపంక్చర్ వైద్యంతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రయత్నించింది. నొప్పులతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. అప్పుడు ఆసుపత్రిలో చేరగా తల్లీబిడ్డా మరణించారు. ఇంట్లోనే డెలీవరీ అయ్యేందుకు యూట్యూబ్ లో వీడియోలు చూశాడు. వైద్య సహాయం తీసుకోకపోవడంతో ప్రసవ సమయంలో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. బాధితురాలి ఇంటికి ఆశా వర్కర్లు వెళ్లినా కూడా భర్త అనుమతించేది కాదని స్థానికులు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

ఈ ఘటన తీవ్రమైన నేరమైన వైద్యామంత్రి వీణాజార్జీ చెప్పారు. మృతురాలికి ఇంటికి గతంలో జిల్లా మెడికల్ అధికారులు వెళ్లి వైద్య సాయం తీసుకోవాలని సూచించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అయితే ఆక్యుపంక్చర్ వైద్యం తీసుకుంటున్నట్లు దంపతులు చెప్పినట్లు తెలిపారు. అయితే సరైన వైద్యం సహాయం లేని కారణంగా తల్లీబిడ్డా మరణానికి కారణమైందని చెప్పారు. ఈ ఘటన దిగ్బ్రాంతి కలిగించిందన్నారు. ఆరోగ్య సంరక్షణలో ముందుండే రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.

ఇది కూడా చదవండి: అధికారులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్ తీసుకెళ్లొద్దు..!!

Latest News

More Articles