Tuesday, May 7, 2024

అధికారులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్ తీసుకెళ్లొద్దు..!!

spot_img

ఈనెల 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణలో ఇంటర్ సహా 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు,పోలీసు, విద్యాశాఖ అధికారులతో సీఎస్ శాంతికుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 9.80.000మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 1521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి కూడా పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్ తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు.

పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో ఎస్పీలు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 18న ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. 5లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి:  ఉత్తరాఖండ్‌లో కాలువలో కారు పడిపోయి ఆరుగురు దుర్మరణం

Latest News

More Articles