Sunday, May 19, 2024

ప్లీజ్ మా దేశానికి రండి..వేడుకుంటున్న మాల్దీవులు.!

spot_img

ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఆదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ విజ్నప్తి చేశారు. ఇరు దేశాల మధ్య బంధం చాలా చారిత్రకమైందని గుర్తు చేశారు.

మనకు ఒక చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా భారత్ తో కలిసి పనిచేయాలని భావిస్తోంది. మేం ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాము. మా ప్రజలతో పాటు ప్రభుత్వం భారతీయులకు ఘనస్వాగతం పలుకుతుంది. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను అని పీటీఐ వీడియోస్ ద్వారా సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైసల్ అన్నారు.

ఇది కూడా చదవండి: నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసియాత్ర .. కారణం ఇదే.!

Latest News

More Articles