Sunday, May 19, 2024

నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసియాత్ర .. కారణం ఇదే.!

spot_img

భారతసంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్రకు బ్రేక్ పడింది. వారు వెళ్లా్లసిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్ లో సాంకేతక లోపం తల్లెత్తింది. దీంతో వీరి యాత్ర నిలిచిపోయింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 8.04గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సింది. కానీ చివర్లో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్ వాయిదా వేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. తిరిగి ఎప్పుడు చేపడతారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్లో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ కు చెందిన అట్లస్ వి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లెందుకు సిద్ధమైంది. నింగిలోకి వెళ్లే ముందు అంటే 90 నిమిషాల ముందు మిషన్ను ఆపేస్తున్నట్లు నాసా ప్రకటించింది. రాకెట్లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్ తోపాటు మరో వ్యోమగామి బుచ్ విలమోర్ ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

ఇది కూడా చదవండి: ఎండాకాలంలో గుడ్లు కచ్చితంగా తినాలి..ఎందుకో తెలుసా?

Latest News

More Articles