Sunday, May 19, 2024

ఎండాకాలంలో గుడ్లు కచ్చితంగా తినాలి..ఎందుకో తెలుసా?

spot_img

గుడ్లు పోషకాలకు పవర్ హౌస్ గా చెప్పుకుంటాం. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటాం. ఎదిగే పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డు ఆహారంగా ఇవ్వాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అలాగే వేసవిలో తప్పనిసరిగా వీటిని డైట్లో చేర్చుకోవాలని సలహాఇస్తున్నారు. వేసవిలో శరీరంలోని పోషకాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్తాయి. వాటిని భర్తీ చేసేందుకు గుడ్లను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. డైట్లో చేర్చుకుంటే న్యూట్రియెంట్స్ రీప్లెస్ చేయవచ్చు. ఎండాకాలంలో గుడ్లు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యానికి మంచిది:
గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాల్లో గుడ్లు ఒకటి. వీటిలో అసంత్రుప్త కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా మోనోఅన్ శాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తాయి.

ఎముకలకు బలం:
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వేసవిలో గుడ్లను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం శోషణను పెంచుతుంది. దీంతో ఎముకలు, కీళ్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎముక పగుళ్లు, బోలు ఎముకల వ్యాది ప్రమాదం తగ్గుతుంది.

బరువు అదుపులో ఉంటుంది:
గుడ్లలో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. గుడ్డు తెల్లసొనలో 50శాతం ప్రొటీన్, పచ్చసొనలో 90శాతం కాల్షియం, ఐరన్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్టులో గుడ్డు తింటే మద్యాహ్న సమయంలో ఎక్కువగా ఆకలి వేయదు. అలాగే పొట్ట ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

ఫోలిక్ యాసిడ్:
గుడ్లలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది పిండం ఎదుగుదలకు అవసరమైన పోషకాన్ని అందిస్తుంది. స్పైనా బిఫిడా వంటి పుట్టుకతో వచ్చే లోపాలను ఫోలిక్ యాసిడ్ నివారిస్తుంది. అందుకే గర్బవతులు రెగ్యులర్ గా గుడ్లు తినడం మంచిది.

ప్రొటీన్ ఫుడ్:
గుడ్లలో ప్రోటీన్ కంటెంట్ అధిక మోతాదులో ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాల్లో ఇది చాలా ముఖ్యమైంది. ప్రోటీన్ శరీర కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కండర ద్రవ్యరాశి నిర్మాణం, నిర్వహణలో కీలక పాత్రను పోషిస్తుంది. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. శరీరంలో సంత్రుప్తి స్థాయిని ప్రోత్సహించడానికి ప్రోటీన్ చాలా అవసరం. వేసవిలో అలసట సర్వసాధారణం అయినప్పటికీ దీన్ని పోగొట్టి శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు ప్రొటీన్ చాలా అవసరం.

ఇది కూడా చదవండి: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈఏపీసెట్ పరీక్షలు..!

Latest News

More Articles