Sunday, May 19, 2024

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈఏపీసెట్ పరీక్షలు..!

spot_img

ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఈపీఎస్ కు అంతా సిద్ధమైంది. ఉదయం 9గంటల నుంచి ఈఏపీసెట్ షురూ కానుంది. మే 11 వరకు జరగనున్న ఈ పరీక్షల్లో 7,8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా 9 నుంచి 11 వ తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఉదయం 9 నుంచి 12 వరకు తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు 3 గంటలపాటు రెండు సెషన్స్ లో పరీక్ష జరుగుతుంది. మంగళవారం ప్రారంభం కానున్న ఈ పరీక్ష ఏపీ, తెలంగాణతో కలిపి మొత్తం 3.5లక్షల మందికిపైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 2.54 లక్షల మంది ఇంజనీరింగ్ లక్షా 200 మందికిపైగా ఇంజనీరింగ్ అండ్ ఫార్మా కోసం అప్లయ్ చేసుకున్నారు. గతంలో ఎంసెట్ గా ఉండే ఈ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది నుంచి మెడిసిన్ నుంచి తొలగించి ఈఏపీసెట్ గా మార్చిన సంగతి తెలిసిందే.

కాగా గతంతో పోల్చితే ఈ ఏడాది ఈఏపీ సెట్ కు దాదాపు 50వేల వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంజనీరింగ్ కోసం 1.5లక్షల మంది బాలురు నమోదు చేసుకున్నారు. లక్షలా 3వేల మంది బాలికలు నమోదు చేసుకున్నారు. మరోవైపు ఫార్మా కోసం 73వేల మంది బాలికలు అప్లయ్ చేసుకోగా..బాలురు 27వేల మంది మాత్రమే అప్లయ్ చేసుకున్నారు. ఇక 90 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరవ్వాలని అధికారులు తెలిపారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమని జేఎన్టీయూహెచ్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: నా అరెస్టుకూ మోదీ కుట్ర పన్నాడు..నేనెక్కడా దొరకలేదు:కేసీఆర్

Latest News

More Articles