Sunday, May 19, 2024

నా అరెస్టుకూ మోదీ కుట్ర పన్నాడు..నేనెక్కడా దొరకలేదు:కేసీఆర్

spot_img

పదేండ్ల పాలనలో తెలంగాణలో ఎన్నో అద్బుతాలు చేశామని..కానీ ఐదునెలల పాలనకే కాంగ్రెస్ ప్రజలను రాచింపాన పెడుతోందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు కాబట్టే బీజేపీ వాళ్లకు దొరకలేదన్నారు. మోదీ వికృతరూపానికి నిదర్శనం ఢిల్లీలిక్కర్కేసు అన్నారు.అందులో కవితను ఇరికించారంటూ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండి తెలంగాణలో అనిశ్చిత వస్తుందన్నారు. అందుకే బీఆర్ఎస్ తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందన్న కేసీఆర్..అసెంబ్లీ ఎన్నికలకు, దీనికి మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. కాంగ్రెసొళ్లు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించారు. అడ్డగోలుగా వాగ్దానాలు చేసిండ్రు. వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. దీంతో ప్రజల్లో తిరుగుబాటు ధోరణి, ప్రభుత్వం పట్ల ఏహ్యభావం స్పష్టంగా కనిపిసోతోంది. తమను మోసం చేశారనే భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిసోతోంది. సహజంగా రాజకీయాల్లో కొత్త ప్రభుత్వం వస్తే ఏ పార్టీకైనా ఎన్నికల తర్వాత ఆరేడు నెలలపాటు హనీమూన్ పీరియడ్ ఉంటుందన్నారు.

కానీ తెలంగాణలో మాత్రం దానికి భిన్నంగా ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోంది. సీఎం కూడా ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుడి మీద ఒట్లు పెడుతున్నారు. అది వాళ్ల పార్టీకి ఒకరకమైన ఇబ్బందిని కలిగిస్తోంది. ఆయన అతి ప్రవర్తన, జుగుప్సాకరమైన భాష అనేది వాళ్ల పార్టీకి శాపంగా మారింది. నా అంచనా ప్రకారం కనీసం 12కు పైగా ఎంపీ సీట్లను బీఆర్ఎస్ గెల్చుకోబోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: గాంధీభవన్ లో పొట్టుపొట్టు కొట్టుకున్న కాంగ్రెసోళ్లు..!

Latest News

More Articles