Sunday, May 19, 2024

ఇంటర్‌ పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు

spot_img

ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే ఇంటర్‌ బోర్డు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామన్నారు. ఇంటర్‌, పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధితశాఖల అధికారులో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ… ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో కలిపి సుమారు 9.80లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఇందు కోసం 1521 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఆయా కేంద్రాల్లో ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్‌ఫోన్‌ తీసుకెళ్లకుండా నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.

ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు,వాల్యువేషన్ సెంటర్లకు తీసుకెళ్లే సమయంలో పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు. పరీక్షా పత్రాలు కూడా లీక్‌ అవకూడదని సీఎం హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షా పేపర్ల తరలింపుపై జిల్లాస్థాయిలో సంబంధిత పోలీస్‌ సూపరింటెండెంట్లు, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 వరకు జరుగుతాయని తెలిపారు. 5.8లక్షల మంది విద్యార్థులు హాజరవనుండగా.. 2,676 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలన్నీరు. పరీక్షా కేంద్రాల వద్ద హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలని సీఎస్‌ ఆదేశించారు.

ఇంటర్‌, పది పరీక్షల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు డీజీపీ రవిగుప్తా.

ఇది కూడా చదవండి: సిద్దిపేట నియోజకవర్గం 10వ తరగతిలో ప్రథమ స్థానంలో నిలవాలి

Latest News

More Articles