Sunday, May 19, 2024

ఇవాళ హైదరాబాద్ కు రానున్న మోడీ.. పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

spot_img

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం నగరానికి వస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మోడీ వస్తుండటంతో హైదరాబాద్ లోని వివిధ రోడ్డు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రాజ్ భవన్ కు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఆంక్షలు మంగళవారం రాత్రి 7.50 గంటలనుంచి రాత్రి 8.25 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు.

బుధవారం ప్రధాని రాజ్ భవన్ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే సమయంలో ఉదయం 8.35 గంటల నుంచి ఉదయం 9.10 వరకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇంకా వివిధ మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.

ఇవాళ బేగంపేట ఎయిర్ పోర్ట్, ఎయిర్ పోర్ట్ వై జంక్షన్, పీఎన్ టీ ఫ్లైఓవర్ కింద రైట్ టర్న్, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్ లాండ్స్, లెఫ్ట్ టర్న్, రాజీవ్ గాంధీ విగ్రహం, యశోదా ఆసుపత్రి, ఎంఎంటీఎస్, రాజ్ భవన్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

రేపు (బుధవారం) మే 8న ట్రాఫిక్ ఆంక్షలు ఉండే  రూట్లు.. రాజ్ భవన్, ఎంఎంటీఎస్, యశోదా ఆసుపత్రి, రాజీవ్ గాంధీ విగ్రహం,, రైట్ టర్న్ ప్రగతి భవన్, బేగంపేట ఫ్లైఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, షాపర్స్ స్టాప్, పీఎన్ టీ ఫ్లైఓవర్ కింద, ఎయిర్ పోర్ట్ వై జంక్షన్ లెఫ్ట్ టర్న్, బేగంపేట ఎయిర్ పోర్ట్. వాహనదారులు సహకరించాల్సిందిగా సూచించారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా తెలిపారు.

ఇది కూడా చదవండి: ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డి నామినేష‌న్

 

Latest News

More Articles