Friday, May 3, 2024

చల్లబడ్డ వాతావరణం. మరో రెండ్రోజులు వర్షాలే..!

spot_img

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు రుతుపవనాలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

Latest News

More Articles