Sunday, May 19, 2024

పంక్చర్ చేస్తుండగా పేలిన లారీ టైర్.. వైరలవుతున్న వీడియో

spot_img

మనం వాడే వాహనాలు ఏదో ఒక సమయంలో పంక్చర్ అవుతూ ఉంటాయి. మనం వెంటనే పంక్చర్ షాపుకు వెళ్లి.. పంక్చర్ వేయించుకుంటాం. అయితే పంక్చర్ వేయడం చూడటానికి అంత వింత కాకపోయినా.. ఆ సమయంలో అజాగ్రత్త వహిస్తే మాత్రం ప్రమాదం తప్పదు. తాజాగా పంక్చర్ వేసే సమయంలో జరిగిన ఓ పేలుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

ఓ పంక్చర్ షాపులో ఇద్దరు వ్యక్తులు లారీ టైర్‎కు పంక్చర్ వేస్తున్నారు. ఈ క్రమంలో టైర్‎లో గాలి పెడుతుండగా.. పీడనం ఎక్కువై అది ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో పంక్చర్ వేస్తున్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి లేచి కిందపడ్డారు. వారిద్దరిలో ఓ వ్యక్తి చేతికి దెబ్బతగిలినట్లు అర్థం అవుతుంది. పక్కనే ఉన్న వారు కూడా టైర్ అలా లేచి కింద పడటంతో భయపడిపోయారు. టైర్ గాల్లోకొ లేచి కిందపడింది కానీ, అదే ఎవరి మీదైనా పడి ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిపోయేవి. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని మిలియన్ల మంది చూడగా.. లక్షల మంది లైక్ చేశారు.

Latest News

More Articles