Sunday, May 12, 2024

డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తే.. అక్కడ అన్‌లిమిటెడ్‌ ఫైన్‌

spot_img

అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. నిత్యం డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీకెండ్‌ వస్తే మందు పార్టీ.., ఫ్రెండ్స్ కలిస్తే మందుపార్టీ.., పండుగొస్తే మందు పార్టీ.. ఇలా పార్టీలు చేసుకొని రోడ్ల మీదికి బైక్‌లు, కార్లు డ్రైవ్‌ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్న ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో చట్టంలో ఉన్న జరిమానాలు, జైలు శిక్షలు సరిపోవని.. మరింత వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అంటున్నారు. తాగినవాళ్లు కారు ముట్టే చాన్స్‌ కూడా ఉండొద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో విజయవంతంగా అమలవుతున్న కారు ఇగ్నిషన్‌తో అనుసంధానమై ఉండే బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ను అందుబాటులోకి తేవాలని చెప్తున్నారు. ఎక్కువ మోతాదులో తాగి దొరికితే అక్కడ కారుకు బ్రీత్‌ అనలైజర్‌ను అమర్చుతారు. కారు నడిపే వ్యక్తి ఆ పరికరంలో ఊది, తాగలేదని తేలాకే ఇంజిన్‌ స్టార్ట్‌ అవుతుంది. ఇలాంటి వినూత్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. తాగి కారు నడిపి ఏటా వేల మంది చనిపోతున్నారని, ఈ మరణాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌కు జరిమానా వివిధ దేశాలలో..

యూకే:
ఆరు నెలల జైలు శిక్ష
అన్‌లిమిటెడ్‌ ఫైన్‌
ఒక సంవత్సరం పాటు డ్రైవింగ్‌ బ్యాన్‌

అమెరికా:
మొదటిసారి..
ఆరు నెలల జైలు శిక్ష
వెయ్యి డాలర్ల దాకా ఫైన్‌
ఆరు నెలల డ్రైవింగ్‌ బ్యాన్‌

రెండోసారి..
సంవత్సరం పాటు జైలు శిక్ష
2500-5000 డాలర్ల ఫైన్
ఒక సంవత్సరం పాటు డ్రైవింగ్‌ బ్యాన్‌

స్వీడన్‌:
రెండేండ్ల పాటు జైలు శిక్ష
రెండేండ్ల పాటు డ్రైవింగ్‌ బ్యాన్‌

ఆస్ట్రేలియా:
తక్కువ మోతాదులో తాగితే..
3 నెలల పాటు డ్రైవింగ్‌ బ్యాన్‌
587 ఆస్ట్రేలియన్‌ డాలర్ల ఫైన్‌
ఎక్కువ మోతాదులో తాగితే..
సంవత్సరం పాటు కారుకు బ్రీత్‌ అనలైజర్‌ అనుసంధానమై ఉండాలి. ఊదితే తాగనట్టు అనిపిస్తేనే కారు స్టార్ట్‌ అవుతుంది.
డ్రైవింగ్‌ బ్యాన్‌, ఫైన్‌

భారత్‌:
మొదటిసారి..
రూ.10 వేల వరకు ఫైన్‌
ఆరు నెలల వరకు జైలు శిక్ష

రెండోసారి..
రూ.15 వేల వరకు ఫైన్‌
రెండేండ్ల వరకు జైలు శిక్ష

Latest News

More Articles