Sunday, May 12, 2024

భారత రాయబార కార్యాలయంలో ఐఎస్‌ఐ గూఢచారి

spot_img

పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(ISI) కోసం పనిచేస్తున్న మాస్కోలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ATS) అరెస్టు చేసింది. అరెస్టైన వ్యక్తి సతేంద్ర సివాల్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. హాపూర్‌లోని షామహియుద్దీన్‌పూర్‌ గ్రామానికి చెందిన సతేంద్ర సివాల్‌ గూఢచర్య నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో తన ఉద్యోగాన్ని ఉపయోగించుకుని రహస్య డాక్యుమెంట్లను.. సున్నితమైన సమాచారాన్ని పాక్‌ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. విస్తృతమైన నిఘా తర్వాత సతేంద్ర సివాల్‌ను విచారణ కోసం మీరట్‌లోని ఏటీఎస్‌ ఫీల్డ్‌ యూనిట్‌కు పిలిపించారు. విచారణలో ఐఎస్‌ఐ కోసం గూఢచార కార్యకలాపాలలో పాల్గొన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ సమాచారం భారత్‌కు భారీ ముప్పుగా మారే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు.

ఇది కూడా చదవండి: నమీబియా అధ్యక్షుడు గింగోబ్‌ క్యాన్సర్ తో కన్నుమూత

Latest News

More Articles