Sunday, April 28, 2024

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మీదున్న శ్రద్ధ.. నిరుద్యోగులపై లేదా రేవంత్ రెడ్డి ?

spot_img

GO 46కి వ్యతిరేకంగా యువత భారీగా నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగ యువకులు నగరంలోని మాదాపూర్‌లో లోని ప్రముఖ కుమారి ఆంటీస్ ఫుడ్ స్టాల్ ముందు శనివారం ధర్నా చేపట్టారు.ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతుందని రాయదుర్గం పోలీసులు కుమారి ఆంటీ స్టాల్‌ను మూసివేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జోక్యం చేసుకుని స్పందించాడు. ఆమెని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోనివ్వాలని ట్వీట్ చేశారు. సీఎం స్థాయి వ్యక్తికీ తెలంగాణ అభివృద్ధిపై ఇంకేం పనిలేదా అని విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా అదే కుమారి ఆంటీ స్టాల్ ముందు తెలంగాణ యువత నిరసన తెలిపింది.

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మీద స్పందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. తమ సమస్యపై కూడా స్పందించాలని యువత వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కుమారి ఆంటీకి చిన్న సమస్య వస్తే వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాము 6 నెలలుగా నిరసన తెలుపుతున్న తమను పట్టించుకోవడం లేదంటూ యువకులు వాపోయారు. జీవో 46 కారణంగా.. సొంత రాష్ట్రంలో కూడా నాన్ లోకల్‌గా మిగిలిపోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధవ్యక్తం చేశారు. ఇప్పటికైన స్పందించి.. తమ సమస్యను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు.

Latest News

More Articles