Friday, May 17, 2024

మణిపూర్ లో మళ్లీ హింస.. ముగ్గురు మృతి

spot_img

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింస ఆగడం లేదు. సోమవారం సాయంత్రం తౌబాల్ జిల్లాలో ముగ్గురిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడినట్లు సమాచారం. దీని తర్వాత, తౌబాల్, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. పలు చోట్ల రాళ్లదాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత శాంతిభద్రతలను కాపాడాలని సీఎం ఎన్‌ బీరేన్‌సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక నివేదికల ప్రకారం, కొందరు గుర్తు తెలియని ముష్కరులు సోమవారం సాయంత్రం తౌబల్ జిల్లాలోని లిలాంగ్ ప్రాంతానికి చేరుకుని స్థానిక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

దాడి తర్వాత ఆగ్రహించిన గుంపు వాహనాలకు నిప్పుపెట్టింది. పలు బైక్‌లు, కార్లు, పెద్ద వాహనాలు దగ్ధమయ్యాయి. విషయం మరింత ముదరకముందే సైన్యం, పోలీసు బలగాలను మోహరించారు. తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్-వెస్ట్, కక్చింగ్, బిష్ణుపర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటన అనంతరం సీఎం బీరెన్ సింగ్ వీడియో సందేశం ద్వారా శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సీఎం అన్నారు. అమాయకులను చంపడం పట్ల బాధగా ఉందని.. నేరస్తులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను నియమించామని తెలిపారు. దీనికి పాల్పడిన వారిని అరెస్టు చేయడంలో ప్రభుత్వానికి సహాయం చేయాలని నేను లిలాంగ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టం ప్రకారం న్యాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: భక్తులకు అలెర్ట్. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం

Latest News

More Articles