Sunday, May 12, 2024

రూ. 20 వేల కోట్లతో 4500 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాం-మంత్రి ప్రశాంత్ రెడ్డి

spot_img

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మౌలిక సదుపాయాల కల్పన పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. ఆయన చొరవతో గత 8 ఏళ్లలో దాదాపు 4500 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించామని చెప్పారు. ఇందుకోసం దాదాపు రూ. 20 వేల కోట్ల ఖర్చు చేశామన్నారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం ఈశ్వరమాధారంలో రూ.15 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడారు. తెలంగాణలో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం చేశామన్నారు. ఇలాంటి పాలసీ దేశంలోనే ఎక్కడ లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీలు నామా నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌ ,సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి , డీసీసీబీ చైర్మన్ కుకురాకూల నాగభూషణo , డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు , రైతు బంధు కమిటీ కన్వీనర్ నల్లమళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Latest News

More Articles