Saturday, May 18, 2024

బండి సంజయ్‌ దమ్ముంటే.. ఎంపీగా ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయ్

spot_img

కరీంనగర్ జిల్లా: బండి సంజయ్‌ కి దమ్ముంటే త్రిబుల్‌ ఐటీ మంజూరు చేయించాలని, ఎంపీగా ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని లైబ్రరీ చైర్మన్ పొన్నం అనిల్ డిమాండ్ చేశారు. కేంద్రం ఎలాంటి మద్దతు ఇవ్వకున్న సీఎం కేసీఆర్‌ ప్రతి జిల్లాకో మెడికల్‌ కళాశాల ఉండాలన్న ఆలోచనతో మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేశారని కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150 మెడికల్‌ కళాశాలను ప్రతి కళాశాలకు రూ.500 కోట్ల నిధులను మంజూరు చేస్తే తెలంగాణకు కనీసం ఒక్కటి కూడా తీసుకురాలేని దద్దమ్మలు బీజేపీ ఎంపీలు అని మండిపడ్డారు. గతంలో వినోద్‌కుమార్‌ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌ త్రిబుల్‌ ఐటీ సాధన కోసం ప్రయత్నాలు చేశారని దీని కోసం 50 ఏకరాల స్థలాన్ని కూడ కేటాయించారని గుర్తుచేశారు.

బండి సంజయ్‌ చేతగానితనం వల్ల త్రిబుల్‌ ఐటీ కర్ణాటకకు తరలిపోయింది. కనీసం తమ నియోజకవర్గాల అభివృద్ది కోసం కూడ నిధులు మంజూరు చేయించుకోలేని దుస్థితిలో బీజేపీ ఎంపీలు ఉండడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు.

Latest News

More Articles