Monday, May 13, 2024

సద్గురు ఆరోగ్యంపై వైద్యులు ఏం చెప్పారంటే.!

spot_img

ఆధ్యాత్మికవేత్త, ఇసా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన మార్చి 14న న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ తీసిన వైద్యులు తలలో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. మార్చి 17న ఆయనకు సర్జరీ చేశారు. ఇప్పుడు కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. సద్గురు మెదడులో ప్రాణాంతక పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల పట్టించుకోలేదు.

తీవ్రమైన తలనొప్పి వేధిస్తున్నప్పటికీ మార్చి 8న జరిగిన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. మార్చి 15,16 తేదీల్లో ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీవ్రమైన తలనొప్పితో ఆయన మార్చి 14న వచ్చారు. తలనొప్పి ఎక్కువవ్వడంతో అదే రోజు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన తలలో తీవ్రమైన రక్తస్రావం అవుతుందని వైద్యులు గుర్తించి వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. మార్చి 17న ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కొద్ది గంటల్లోనే బ్రెయిన్ సర్జరీ చేశారని ఇషా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా వైద్యులు మాత్రం సద్గురు వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ ఎలా సునాయాసంగా నిర్వహించవచ్చో సద్గురు ప్రదర్శించారు.అంటూ వైద్యులు వెల్లడించారు. కాగా అసుపత్రిలో ఉన్న సద్గురును ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ నిబంధనలలో కొత్త మార్పులు.!

Latest News

More Articles