Friday, May 3, 2024

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్..డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్.!

spot_img

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థిని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసింది. ఇప్పుడా ఘటన కలకలం రేపుతోంది. డ్రగ్స్ మాఫియాకు చెందిన కొందరు ఈ విషయాన్ని హైదరాబాద్ లో ఉంటున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసిచెప్పారు. తమకు అమెరికా డాలర్ల రూపంలో డబ్బు పంపిస్తే వదిలేస్తామని లేకపోతే కిడ్నీలు అమ్మేస్తామంటూ బెదిరించినట్లు తెలిసింది. మార్చి 8వ తేదీ నుంచి తమ కుమారుడు ఫోన్లో అందుబాటులో లేడని హైదరాబాద్ లోని అబ్దుల్ బంధువులు తెలిపారు. తమ కుమారుడిని రక్షించాలని కోరుతూ అబ్దుల్ పేరెంట్స్  కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించారు.

కాగా విద్యార్థి అబ్దుల్ బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం..హైదరాబాద్ నాచారంలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన మహ్మద్ సలీమ్ కుమారుడు అబ్దుల్ మహ్మద్ 2023లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్ లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. రోజూ ఫోన్లో మాట్లాడే అబ్దుల్ చివరిసారిగా ఈనెల 7న తండ్రితో మాట్లాడాడు. ఆ తర్వాత ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. 8న అబ్దుల్ కనిపించడంలేదని అమెరికాలో చదివే అతని స్నేహితుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. దీనిని చూసిన అబ్దుల్ సోదరి తన పేరెంట్స్ కు చెప్పింది.

అబ్దుల్ కు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదు. 9వ తేదీన ఎంబీటీ నేత అమ్జద్ సాయంతో కేంద్ర విదేశాంగ శాక మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. వాషింగ్టన్ లో ని భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలరి రిక్వెస్ట్ చేశారు. అమెరికాలోని సలీమ్ బంధువులు క్లీవ్ లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చివరిసారిగా 8వ తేదీన క్లీవ్ లాండ్ లోని వాల్ మార్ట్ స్టోర్ లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రోజులు గడుస్తున్నా తమ కొడుకు ఆచూకీ లభించకపోవడంతో అబ్దుల్ తండ్రి మరోసారి 18వ తేదీని విదేశాంగా శాఖను, భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

ఇది కూడా చదవండి: సద్గురు ఆరోగ్యంపై వైద్యులు ఏం చెప్పారంటే.!

Latest News

More Articles