Sunday, April 28, 2024

మరో వివాదంలో మంత్రి పొన్నం..వాయిస్ రికార్డ్ లీక్..!

spot_img

మంత్రి పొన్నం ప్రభాకర్ మరోవివాదంలో ఇరుక్కున్నారు. 2 నెలల క్రితం ఓ అధికారితో మంత్రి పొన్నం జరిపిన ఫోన్ సంభాషన వాయిస్ రికార్డు లీక్ అవ్వడం కలకలం రేపింది. మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆ విషయాన్ని పక్కనపెట్టి మాటలను రికార్డు చేసి లీక్ చేసిన అప్పటి హన్మకొండ ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని పొన్నం కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 5రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మంత్రి స్పందించారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటే బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేశారు.

మంత్రి పొన్నం ఫోన్ సంభాషణ ఈవిధంగా ఉంది…గత ప్రభుత్వ హయాంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయించారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కాదు. మా అభ్యర్థి ప్రణవ్ చేతుల మీదుగా లేదంటే ప్రొటోకాల్ కాదంటే అధికారులే నేరుగా వెళ్లి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయాలి. ఒక్క చెక్కు ఎమ్మెల్యే చేతికి పోయినా బాగుండదంటూ మంత్రి పొన్నం అప్పటి హన్మకొండ ఆర్డీవో, కమలాపూర్ ఎమ్మార్వో మాధవికి హుకుం జారీ చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో తన ఫోన్ వాయిస్ కాల్ రికార్డును లీక్ చేసిన హన్మకొండ ఆర్డీవో పై చర్యలు తీసుకోవాలని సీఎస్ కు మంత్రి పొన్నం ఫిర్యాదు చేశారు. ఆర్డీవో పై ఫిర్యాదు విషయాన్ని మంత్రి పొన్నం బుధవారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో ప్రస్తావించారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్..డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్.!

Latest News

More Articles