Saturday, May 11, 2024

డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌

spot_img

న్యూఢిల్లీ: డిసెంబర్ నెల 4 నుంచి 22 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. కాగా, ఈ సమావేశాల్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2023, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లులు ఉన్నాయని తెలుస్తోంది. వీటితోపాటు జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లతో సెషన్స్‌లోనే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పెండింగ్‌లో 37 బిల్లులు ఉన్నాయి.

Latest News

More Articles