Friday, May 17, 2024

వైద్య చరిత్రలో అరుదైన కేసు నమోదు.. కడుపులో బిడ్డకు డెంగ్యూ

spot_img

కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి తల్లి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. తన ఆరోగ్యంతో పాటు తన కడుపులోని బిడ్డ ఆరోగ్యం గురించి కష్టమైన పనులు కూడా ఎంతో ఇష్టంగా చేస్తుంది. తల్లికి వచ్చే అనారోగ్యం ప్రభావం కడుపులోని బిడ్డపై కూడా ఉంటుంది. అది జలుబు అయినా, దగ్గు అయినా, జ్వరమైనా తల్లికొస్తే.. బిడ్డ కూడా ఇబ్బంది పడుతుంది. ఇలా నెలలు నిండిన ఓ తల్లి డెంగ్యూ భారిన పడటంతో బిడ్డ కూడా డెంగ్యూ బారిన పడింది. ఈ ఘటన కలకత్తాలో వెలుగుచూసింది.

Read Also: గణేష్ మండపం ముందు డ్యాన్స్‌ చేస్తూ యువకుడు మృతి.. వీడియో వైరల్

కలకత్తా లేక్‌ టౌన్‌కు చెందిన 29 ఏండ్ల నిండు గర్భవతి సెప్టెంబర్‌ 9న డెంగ్యూ జ్వరంతో చర్నాక్‌ ఆస్పత్రిలో చేరింది. అప్పటికే ఆమె ప్లేట్‌లెట్‌ల సంఖ్య 40 వేలు ఉంది. దాంతో ఆమెను నాలుగు రోజులు పర్యవేక్షణలో ఉంచి, సిజేరియన్‌ ద్వారా ప్రసవం చేశారు. ఆ తర్వాత రొటీన్‌ రక్త పరీక్షలలో తల్లికి డెంగ్యూ ఉన్నట్టు గుర్తించారు. దాంతో పుట్టిన బిడ్డకు కూడా పరీక్షలు నిర్వహించగా ఆ శిశువుకు కూడా డెంగ్యూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వెంటనే బిడ్డకు ఐవీ థెరపీ చేయడం ప్రారంభించడంతో కోలుకుంది. కొన్ని రోజుల తర్వాత తల్లీబిడ్డలిద్దరూ ఆ వ్యాధి నుంచి బయటపడటంతో వారిని డిశ్చార్జి చేశారు.

Read Also: అసెంబ్లీలో మీసం మెలేసిన బాలయ్య.. దమ్ముంటే రా చూసుకుందామన్న అంబటి

అయితే గర్భంతో ఉన్న మహిళ నుంచి అరుదైన సందర్భాలలో మాత్రమే కడుపులోని పిండానికి ప్రసవానికి ముందు గానీ, ప్రసవ సమయంలో కాని, ప్రసవమైన వెంటనే కానీ జబ్బు సోకే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ కేసులో కూడా అదే మాదిరిగా తల్లి నుంచి బిడ్డకు డెంగ్యూ వ్యాధి సోకి ఉంటుందని వైద్యలు భావిస్తున్నారు. తల్లి ద్వారా బిడ్డకు ఇన్‌ఫెక్షన్‌ సోకడాన్నే వైద్య పరిభాషలో వర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌ అంటారు. ఇది దోమలలో సాధారణమని, మనుషుల్లో అతి అరుదుగా జరుగుతుందని వైద్య నిపుణులు తెలిపారు.

Latest News

More Articles