Sunday, May 12, 2024

అయోధ్యరాముడికి కానుకగా 7కిలోల బంగారు రామాయణం.!

spot_img

యూపీలోని అయోధ్య బాలరాముడికి ఓ భక్తుడు సుమారు 5కోట్ల విలువ చేసే 7కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ సుబ్రమణ్యం లక్ష్మీ నారాయణ్ 7 కిలోల బంగారంతో చేసిన బంగారు రామాయణాన్ని బాలరాముడికి సమర్పించారు. ఈ బంగారు రామాయణం అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో ఉంచారు. బంగారు రామాయణంలోని ప్రతి పేజీ రాగితో తయారు చేశారు. దానిపై రామచరితమానస్ నుండి శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి. 10,902 పద్యాల ఇతిహాసంలోని ప్రతి పేజీకి 24 క్యారెట్ల బంగారంతో పూత పూశారు. ఈ విశిష్ట రామాయణం దాదాపు 480 నుండి 500 పేజీల వరకు ఉంటుంది. దీని తయారీలో దాదాపు 7 కిలోల బంగారంతో పాటు రాగిని కూడా ఉపయోగించారు. దీని బరువు దాదాపు ఒకటిన్నర క్వింటాలు.

మాజీ ఐపీఎల్ సుబ్రమణ్యం లక్ష్మీ నారాయణ్ తన జీవిత సంపాదనను తన మరణానంతరం బాలరాముడికే అందజేయాలని వీలునామా రాశానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో 151 కిలోల బరువున్న 5 కోట్ల రూపాయలతో ఈ అపూర్వ రామాయణాన్ని తయారు చేయించినట్లు చెప్పారు. ఈ రామాయణం తయారీలో 7 కిలోల బంగారం, 140 కిలోల రాగిని ఉపయోగించారు. ఇప్పుడు బాలరాముడి గర్భగుడిలో భక్తులు ఈ విశిష్ట రామాయణాన్ని కూడా చూడగలరు.

చెన్నైకి చెందిన ప్రసిద్ధ వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ దీనిని తయారు చేసింది. ఇది రాముడి కొలవైన ప్రదేశం నుండి 15 అడుగుల దూరంలో ఈ ఆలయ గర్భగుడిలో స్థాపించబడింది. ఈ రామాయణంలో వ్రాసిన శ్లోకాలు 14 నుండి 12 అంగుళాల పరిమాణంలో ఉన్నాయి. రామ్ లల్లాకు పట్టాభిషేకం చేసినప్పటి నుంచి విరాళాల ప్రక్రియ నిరాటంకంగా కొనసాగడం గమనార్హం. రామ మందిరం కోసం రామభక్తులు బహిరంగంగా విరాళాలు ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: పుల్వామాలో భారీ ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం.!

Latest News

More Articles