Saturday, May 4, 2024

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ సంచలన నిర్ణయం..అథ్లెట్లకు భారీ నజరానా.!

spot_img

ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ కు ముందే ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 128ఏళ్ల ప్రపంచ క్రీడల చరిత్రలో ఇది సరికొత్త అధ్యయనం. ఒలింపిక్స్ లో పాల్గొనే, పతకాలు గెలిచిన క్రీడాకారులకు పతకాలు తప్ప నగదు బహుమానం అందించలేదు. కానీ త్వరలోనే పారిస్ వేదికగా జరగనున్న ఒలింపికస్ ఈ సంప్రదాయానికి వరల్డ్‌ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) ముగింపు పలికింది.

2024 ఒలింపిక్స్‌లో భాగంగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగాల్లో పోటీపడి బంగారు పతకాలు గెలిచే క్రీడాకారులకు నగదు బహుమతి కింద 50వేల అమెరికా డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 41.60లక్షల అందించేందుకు రెడీ అయ్యింది. ఇలా నగదును బహుమానం ప్రకటించిన తొలి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్ల్యూఏ నిలిచింది. ఈ మేరకు బుధవారం వరల్డ్ అథ్లెటిక్స్ ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించింది. ప్రోత్సహాకాలు అందించేందుకు 2.4మిలియన్ అమెరికా డాలర్లను ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ వద్ద డిపాజిన్ చేసినట్లు వెల్లడించింది. 48 విభాగాల్లో బంగారు పథకాలు గెలిచేవారికి ఈ నగదును అందజేస్తారు.

టోక్యో గేమ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా నుంచి పారిస్‌లో స్వర్ణ పతకాన్ని భారత్‌ ఆశిస్తోంది. అతను ఒలింపిక్ క్రీడలలో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్, వ్యక్తిగత క్రీడలలో రెండవ వ్యక్తి రికార్డు క్రియేట్ చేశాడు.

ఇది కూడా చదవండి: అయోధ్యరాముడికి కానుకగా 7కిలోల బంగారు రామాయణం.!

Latest News

More Articles