Saturday, May 18, 2024

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో తెలంగాణ సీఎం ఎవరో చెప్పలేకపోయిన యువతి.. వైరలవుతున్న వీడియో

spot_img

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా నిర్వహిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి (KBC) ఎంత ఫేమసో చెప్పక్కర్లేదు. 2000 సంవత్సరంలో మొదలైన ఈ షో.. నిర్విరామంగా కొనసాగుతూ ప్రస్తుతం 15వ సీజన్‎కు చేరుకుంది. అయితే ఈ సీజన్‎లో తెలంగాణ గురించి అడిగిన ఓ ప్రశ్నకు యువతి సమాధానం చెప్పలేకపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Read Also: దర్శకుడు ఆర్జీవీపై బర్రెలక్క ఫిర్యాదు

ఈ నెల 15న ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో రూ.40 వేల ప్రశ్నగా రేవంత్‌ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అని పార్టిసిపెంట్‌ను అమితాబ్‌ ప్రశ్నించారు. దానికి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఆంధప్రదేశ్‌ అని ఆప్షన్లు కూడా ఇచ్చారు. అయితే సమాధానం చెప్పలేకపోయిన యువతి.. లైఫ్‌లైన్‌ తీసుకున్నది. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది తెలంగాణ అని సూచించారు. దాంతో ఆ యువతి కూడా వారు చెప్పిన ఆన్సర్ వైపే మొగ్గుచూపింది.

Latest News

More Articles