Monday, May 20, 2024

విషాదం.. చర్చిపైకప్పు కూలి 10 మంది మృతి

spot_img

మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ చర్చి పైకప్పు కూలి 10 మంది మృతి చెందారు. మరో 60 మంది వరకు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. తామౌలిపాస్‌ రాష్ట్రం సియుడాడ్‌ మదెరో నగరంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Also Read.. దారుణం.. సూపర్ మార్కెట్లో షాక్ తగిలి నాలుడేండ్ల చిన్నారి మృతి

స్థానిక శాంటాక్రూజ్‌ చర్చి లో 100 మందికిపైగా స్థానికులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో చర్చి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Latest News

More Articles