Wednesday, May 8, 2024

పసుపుకు బోర్డు ఏర్పాటుకు పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయాలని ప్రధాని మోడీకి తెల్వదా?

spot_img

నిజామాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలని గుర్తుచేశారు. మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు కోసం బిల్లు పెట్టలేదని నిలదీశారు.

Also Read.. దారుణం.. సూపర్ మార్కెట్లో షాక్ తగిలి నాలుడేండ్ల చిన్నారి మృతి

పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారని మండిపడ్డారు. 1986 పార్లమెంట్ ద్వారా చట్టమైన స్పైస్ బోర్డులో భాగంగా ఉన్న పసుపుకు బోర్డు ఏర్పాటు చేయాలంటే ప్రత్యేక చట్టం చేయాలని ప్రధాని మోడీకి తెల్వదా అని ప్రశ్నించారు.

Also Read.. 20ఏళ్ల సమస్య పరిష్కారం.. ఆటో నగర్ లారీ అడ్డా ఎత్తివేత

మీ ఓట్ల రాజకీయం కోసం రైతులను ఇంకా ఎన్ని ఏండ్లు మభ్య పెడతారని ధ్వజమెత్తారు. ఎద్దు ఎవుసం తెల్వని కాంగ్రెస్ ను, రైతును మోసం చేసే బీజేపీ ని నమ్మితే అరిగోసే..తస్మాత్ జాగ్రత్త అని సూచించారు. కేసిఆర్ తోనే తెలంగాణ పదిలం.. ఆయన నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.

Latest News

More Articles