Sunday, May 19, 2024

20ఏళ్ల సమస్య పరిష్కారం.. ఆటో నగర్ లారీ అడ్డా ఎత్తివేత

spot_img

హైదరాబాద్ : 20ఇండ్ల నుండి పరిష్కారం అవ్వకుండా స్థానికులతో పాటు హైవే పై అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందిగా మారిన ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా సమస్య ముగిసిందని ఎల్బీనగర్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి తెలిపారు. ఆటో నగర్ లోని ఇసుక లారీల అడ్డ వద్ద సమస్యను పరిష్కరిస్తూ ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఆర్టిఎ అధికారులు,ఆర్ అండ్ బి అధికారులతో కలిసి స్థానికులకు సమస్య పరిష్కారం అంశాలను వివరించారు. ఎన్నో ఎండ్లుగా ఉన్న సమస్య వచ్చే 6వ తేదీన శుభం పడనుందని అన్నారు. ఈ నెల ఆరున ఇసుక లారీల అడ్డాను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు.

Also Read.. విషాదం.. టీచర్ కొట్టడంతో యూకేజీ చదువుతున్న బాలుడు మృతి!

ఈ సందర్భంగా ఎమ్మేల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… ఇసుక లారీ లడ్డతో స్థానికంగా ఉన్నటువంటి కాలనీలతోపాటు విజయవాడ రహదారిపై వెళుతున్నటువంటి ప్రయాణికులు గాయాలపాలవ్వడం , ఎంతోమంది చనిపోవడం బాధాకరం అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కావాలని ఎన్ని ఇబ్బందులు తలెత్తిన ప్రజల ప్రాణాలు ముఖ్యమని అందరినీ ఒప్పించి మెప్పించి ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరించడం జరిగిందని. తాను ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లే ఈ అడ్డాను తొలగించామని తెలిపారు.

Also Read.. భారత దేశంలో ఐటీ మంత్రి అంటే వినపడే పేరే కేటీఆర్..!

ఈ సమస్య పరిష్కారంతో సుమారు 21 కాలనీలవాసులుకు ఉపశమనం కలిగింది అన్నారు. ఇసుక అడ్డాను హైవే కు దూరంగా లోపల ఎవరికి ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో లారీల అడ్డా కోసం ఔటర్ రింగు రోడ్డు అవతల ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు.ఈ సమస్య పరిష్కారం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Latest News

More Articles