Monday, May 20, 2024

రేవంత్ రెడ్డి, మోడీ  చేతుల్లో ఏమి లేదు

spot_img

రాజకీయల కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రజలను భయపెడుతున్నాయన్నారు కరీంనగర్ జిల్లా పార్లమెంట్ బీఆర్ఎస్  అభ్యర్థి బి. వినోద్ కుమార్. రేవంత్ రెడ్డి, మోడీ చేతుల్లో ఏమి లేదన్నారు. కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన..ప్రధాని  మోడీ వేములవాడకు వస్తున్నారని వారం క్రితమే బీజేపీ ప్రకటించింది.కాశీ కి ఎంపీ అయినా మోడీ దక్షిణ కాశీ కి వస్తున్నారంటే గొప్ప ప్రకటన చేస్తారనుకున్న. వేములవాడ గురించి ఒక సెకను కూడా మాట్లాడ లేదు. ఒక్క హామీ ఇవ్వలేదన్నారు.

వేములవాడను ప్రసాద్ పథకం లో చేర్చాలని లిఖిత  పూర్వకంగా రాసి ఇచ్చినట్లు తెలిపారు వినోద్ కుమార్. వేములవాడ దేవాలయ  అభివృద్ధి కోసం 32 ఎకరాల భూమి సేకరించి దేవాదాయ శాఖకు అప్పగించడం జరిగిందన్నారు. మోడీ హామీ ఇవ్వలేదు…బండి సంజయ్ ఏమి చేయలేదని విమర్శించారు. బండి సంజయ్ కూడా అడగలేదన్నారు. ప్రధానిని అడగలేని ఎంపీ మనకు ఎందుకు అని ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని అని అడిగారు.

జాతీయ ప్రాజెక్టులు అడిగితే కేంద్రం ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు వినోద్ కుమార్. బడి, గుడి, అభివృద్ధి అడగడు.మోడీ  ఫ్రస్టేషన్ కు గురైనట్లు కన్పిస్తున్నాడు. అనుకున్నానన్ని మెజారిటీ స్థానాలు రావడం లేదని ఆయన ఇప్పటికే తెలిసినట్లుందన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ వస్తే రిజర్వేషన్లు గుంజుకుంటారు అని ప్రచారం చేస్తున్నారు.ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్లను ఎవరు ముట్టుకోలేరు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కరీంనగర్ నియోజకవర్గానికి 5 ఏళ్లలో 5పాయలు  ఇవ్వలేదు. సమస్యలు పక్కదారి  పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వినోద్ కుమార్.

ఇది కూడా చదవండి:ఐదు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త

Latest News

More Articles