Monday, May 20, 2024

తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు

spot_img

రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రేపటి(గురువారం) నుంచి ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఇవాళ(బుధవారం) సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని.. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

నిన్న(మంగళవారం) పలు జిల్లాలో భారీగా వర్షం కురిసింది. అకాల వర్షాలతో రైతులకు భారీగా పంటనష్టం జరిగింది. మరోవైపు హైదరాబాద్ లో కుండపోత వాన పడింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ వానలు పడే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అలర్ట్ గా ఉండాలని..ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి:రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లని చెక్కు లాంటిది

Latest News

More Articles