Monday, May 20, 2024

బీజేపీకి ఓటేస్తే సిలిండ‌ర్ ధ‌ర రూ. 5 వేలు అయిత‌ది

spot_img

మోడీ పాల‌న‌లో నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌లన్నీ ఇపరీతంగా పెరిగిపోయాయ‌ని ఆరోపించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్లీ  ఇప్పుడున్న ఈ ప‌రిస్థితుల్లో బీజేపీకి ఓటేస్తే సిలిండ‌ర్ ధ‌ర రూ. 5 వేలు అవుతుందన్నారు. క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణ కేంద్రంలోని హైద‌రాబాద్ చౌర‌స్తాలో నిర్వ‌హించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ అభ్య‌ర్థి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు రావాల్సిన కృష్ణా జ‌లాల్లో మోడీ వాటా తేల్చ‌లేదు. పాల‌మూరు- రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ఇవ్వ‌లేదు. అయినా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారు. రాముడికి గుడి క‌ట్టామ‌ని ఓట్లు వేయ‌మ‌ని అడుగుతున్నారు. కేసీఆర్ యాదాద్రిని కట్టించలేదా..? మ‌నం యాదాద్రిని అడ్డం పెట్టుకుని ఓట్లు అడ‌గ‌డం లేదు కదా. కేసీఆర్ కాళేశ్వ‌రం, పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ క‌ట్టించారు. చెరువుల‌ను బాగు చేయించారు. ఆ ప్రాజెక్టుల‌కు దేవుళ్ల పేర్లే పెట్టారు. ఒక్క గుడి క‌ట్టించినందుకు మోడీకి ఓటు వేయాలంటున్నారు. మ‌రి యాదాద్రితో పాటు ఎన్నో ప్రాజెక్టులు క‌ట్టించి వాటికి దేవుళ్ల పేర్లు పెట్టిన కేసీఆర్‌కు ఎన్నిసార్లు ఓటేయాలో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు.

మ‌న రాజ్యాంగాన్ని ఎత్తి అవ‌త‌ల ప‌డేస్తాం అని బీజేపోళ్లు అంటున్నారు. బీజేపీకి మెజార్టీ సీట్లు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఈసారి మోడీ గెలిస్తే 400 సీట్లు వ‌చ్చుడేమో కానీ.. నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్, డిజీల్ ధ‌ర‌లు రూ. 400కు పెర‌గ‌డం ఖాయమన్నారు కేటీఆర్. మ‌ళ్లోసారి పొర‌పాటున బీజేపీకి ఓటేస్తే సిలిండ‌ర్ ధ‌ర 5 వేలు అవుతుదన్నారు. రూ. 400 ఉన్న సిలిండ‌ర్‌ను రూ. 1200 చేసింది మోడీ ప్రభుత్వం. లీట‌ర్ పెట్ర‌ల్ రూ. 60 ఉంటే.. దాన్ని రూ. 105కు పెంచింది. పేద ప్ర‌జ‌ల‌ను మోడీ న‌మ్మించి మోసం చేశార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

ఇది కూడా చదవండి:రేవంత్ రెడ్డి, మోడీ  చేతుల్లో ఏమి లేదు

Latest News

More Articles