Monday, May 20, 2024

రాష్ట్రంలోని ఇంట‌ర్ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

spot_img

తెలంగాణలోని జూనియ‌ర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు (TSBIE) ఇవాళ(బుధ‌వారం) షెడ్యూల్ రిలీజ్ చేసింది. మే 9వ తేదీ నుంచి  మొదటి ద‌శ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. 9 నుంచి మే 31వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఇంట‌ర్ కాలేజీల్లో స్వీక‌రించ‌నున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీ లోగా తొలి ద‌శ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ పూర్తి చేయ‌నున్నారు.

ఇంట‌ర్‌లో అడ్మిషన్  తీసుకోవాల‌నుకునే విద్యార్థులు ఇంట‌ర్నెట్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా ద‌ర‌ఖాస్తునకు జ‌త‌ప‌ర‌చాల్సి ఉంటుంది. ప్రొవిజిన‌ల్ అడ్మిష‌న్ పూర్త‌యిన త‌ర్వాత క‌చ్చితంగా ఒరిజిన‌ల్ మెమోతో పాటు టీసీ స‌మ‌ర్పించాలి. ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన జీపీఏ ఆధారంగా ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. ప్ర‌వేశాల కోసం ఎలాంటి ఎంట్రెన్స్ టెస్టులు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఆయా కాలేజీల‌కు ఇంట‌ర్ బోర్డు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ఇది కూడా చదవండి:బీజేపీ ఓట్లు కొంటోంది

Latest News

More Articles