Monday, May 20, 2024

బీజేపీ ఓట్లు కొంటోంది

spot_img

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తోందని ఆరోపించారు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ. ఇవాళ(బుధవారం) తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మితాలి బాఘ్‌కు మద్దతుగా ఆరామ్‌ బాఘ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు మమతా బెనర్జీ.ఓట్ల కొనుగోలు కోసం ప్రజలకు బీజేపీ పార్టీ రూ. 5000, రూ. 10 వేలు, రూ. 15 వేలు వరకు డబ్బు పంచుతోందని ఆరోపించారు. ప్రస్తుత బీజేపీ నేతలు మాజీ సీపీఐ (ఎం) సంఘ విద్రోహులలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ వాతావరణం వద్దనుకుంటే బీజేపీకి ఓటు వేయద్దని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. ఢిల్లీలో అధికార సమీకరణం మార్పునకే ఈ ఎన్నికలు అని మమత తెలిపారు. ఢిల్లీలో అధికార సమీకరణాన్ని మార్చాల్సి ఉందన్నారు. మార్పును తీసుకురాల్సి ఉందని ఆమె సూచించారు. బెంగాల్ ప్రజలను అప్రతిష్ట పాలు చేసే అలవాటు బీజేపీకి ఉందన్నారు మమతా బెనర్జీ.

తప్పుడు అత్యాచార ఆరోపణలు చేసేందుకు డబ్బు చెల్లించడం ద్వారా సందేశ్‌ఖాలి మహిళలను వారు ఏవిధంగా అవమానించారో మీరే చూడండి  అని అన్నారు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్‌లో 26 వేల ఉద్యోగాలను బీజేపీ తీసేసుకుందని ఆరోపించారు. అయితే కానీ నిజం గెలిచిందన్నారు. నిన్న(మంగళవారం) సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ప్రస్తుతానికి ఆ ఉద్యోగాల పరిరక్షణ జరిగిందనే సంతృప్తి కలిగిందన్నారు. మోడీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లయితే మైనారిటీలు, ఆదివాసీలు, ఓబీసీల ఉనికి సంక్షోభంలో పడుతుందని స్పష్టం చేశారు మమత బెనర్జీ.

ఇది కూడా చదవండి:నడ్డా, అమిత్ మాల్వీయకు బెంగళూరు పోలీసుల సమన్లు

Latest News

More Articles