Monday, May 20, 2024

IFS ఫలితాలు విడుదల..సత్తాచాటిన తెలుగు తేజాలు..!

spot_img

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. గత ఏడాది నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు మెయిన్ పరీక్షలను నిర్వహించారు. ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫలితాలను నేడు కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ర్యాంకర్ల జాబితాను రిలీజ్ చేసింది. వీరిలో మొత్తం 147మంది పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు రికమెండ్ చేసింది కమిషన్. జనరల్ కేటగిరిలో 43మందిని ఎంపిక చేసింది. ఈ డబ్ల్యూఎస్ లో 20, ఓబీసీలో 51, ఎస్సీ 22. ఎస్టీ 11 మంది ఎంపికయ్యారు.

అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పోతుపురెడ్డి భార్గవ్ కు 22వ ర్యాంకు, మన్నెం అజయ్ కుమార్ కు 44వ ర్యాంకు, భార్గవ్ కుమార్ కు 124వ ర్యాంకు సాధించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు upsc.gov.inవెబ్ సైట్ కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు

Latest News

More Articles