Monday, May 20, 2024

పారిశుద్ధ్య సేవలకు.. సరికొత్త సిల్ట్ కార్టింగ్ వాహనాలు

spot_img

పలు దళిత కుటుంబాలకు లబ్ది చేకూర్చడంతో పాటు నగర ప్రజలకు మరింత మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడానికి ఈ మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ తీరంలోని డా.బీఆర్. అంబేడ్కర్ విగ్రహం పక్కన సోమవారం జరిగిన సిల్ట్ కార్టింగ్ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు వాటిని అందించారు.

గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడు బాపూజీ, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాత్ముడు చూపిన బాటలో కుల, మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తర్వాత రాష్ట్రంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. మనకు స్వాతంత్య్రం లభించి 76 ఏళ్లు అవుతుందని… ఈ కాలంలో దళితుల ఉద్దరణకు, అభ్యున్నతికి పాటుపడిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఇది పరిపాలన దక్షత కలిగిన ఆయన లాంటి నాయకుల వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Latest News

More Articles