Wednesday, May 22, 2024

రేపు ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాల విడుదల

spot_img

తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. టెన్త్ రిజల్ట్స్ ను రేపు(మంగళవారం) విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్ లైన్ లో విడుదల కాబోతున్నాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలకు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,50,433 మంది బాలికలు… 2,57,952 మంది బాలురు పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 13 నాటికి పూర్తయింది. పదో తరగతి పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఇవాళ 3 గంటలకు ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

Latest News

More Articles