Tuesday, May 21, 2024

ఇవాళ 3 గంటలకు ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

spot_img

లోక్‌సభ ఎన్నికలకు ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 271 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమెదించారు. ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది. తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

అత్యధికంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలో 114 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56, మెదక్‌ 54, కరీంనగర్‌ 53, వరంగల్‌ 58, ఖమ్మం 45, మహబూబ్‌నగర్‌ 42, నిజామాబాద్‌ 42, జహీరాబాద్‌ 40, నాగర్‌ కర్నూల్‌ 34, మహబూబాబాద్‌ 30, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 21 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు. మే 13న పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

ఇది కూడా చదవండి: నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థికి నిరసన సెగ

Latest News

More Articles