Sunday, May 19, 2024

శబరిమల ఆలయం వద్ద అపశృతి

spot_img

కేరళ: శబరిమల ఆలయం వద్ద అపశృతి చోటుచేసుకుంది. దర్శనం కోసం క్యూలైన్‌లో వేచివున్న తమిళనాడుకు ఓ 11 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. సుదీర్ఘ సమయం క్యూలైన్‌లో వేచి ఉన్న బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే అప్రమత్తమైన ఆలయ అధికారులు.. బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. బాలిక గత మూడేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read.. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చిన మావోయిస్టులు!

మరోవైపు శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది.  ఇదిలా ఉండగా.. విపరీతమైన రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 10,000 తగ్గించారు. రోజువారీ గరిష్ఠ భక్తుల సంఖ్య పరిమితిని 90 వేల నుంచి 80 వేలకు కుదించారు. శబరిమల అయ్యప్ప ఆలయం గత నెల 17వ తేదీ నుంచి తెరుచుకున్న విషయం తెలిసిందే.

Latest News

More Articles