Saturday, May 18, 2024

17,227 మంది రేషన్‌ డీలర్లకు లబ్ధి 

spot_img

జనగాం : రేషన్‌ డీలర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సముచిత గౌరవం ఇస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు. పాలకుర్తిలో జరిగిన రేషన్ డీలర్ల  ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ కు ముందు రేషన్ డీలర్లకు కేవలం టన్నుకు రూ. 200 ఉంటే.. ఇప్పుడు రూ. 1400కు ఇస్తున్నామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీని కారణంగా ప్రభుత్వం పై ఏటా అదనంగా రూ.139 కోట్ల భారం పడుతుందని వివరించారు. కేంద్రం కమిషన్ పెంచుకున్నా రాష్ట్రమే పెంచి ఇస్తుందని చెప్పారు.

కరోనా సమయంలో చనిపోయిన 100 మంది డీలర్ల వారసులకు షాపులను కేటాయించి కేసీఆర్‌ మానవత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. రేషన్ డీలర్లలకు బీమా, రెన్యూవల్‌ను ఐదేండ్లకు పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి డీలర్‌ను తీసుకువస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

Latest News

More Articles