Saturday, May 4, 2024

రేవంత్ రెడ్డిపై తిరుగుబావుటా.. 200 మంది నాయకులు రాజీనామా

spot_img

హైదరాబాద్: ఉప్పల్ కాంగ్రెస్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై  కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర పీసీసి సెక్రటరీ పూడూరి జితేందర్ రెడ్డితో సహా 200 నాయకులు కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ పీసీసీకి అర్హుడు కాదని వారు నినదించారు. సోనియాను, రాహుల్ ను, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని నిందించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు.

Also Read.. హైదరాబాద్‌ మియాపూర్‌లో 17 కిలోల బంగారం సీజ్‌

పార్టీలో పరిణామాలు చూస్తుంటే అందరూ అన్నట్లు ఈయన రేవంత్ రెడ్డి కాదు. రేటెంత రెడ్డి అనే పదానికి పూర్తి అర్హుడనిపిస్తుంది. ఉప్పల్ లో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ ను మోస్తున్న వారిని కాదని, ఆయనకు వత్తాసు పలుకుతూ, సీఎం సీఎం అని నినాదాలు చేసిన వారికి, గుమ్మం దగ్గర కాపలా ఉన్నవారికి మాత్రమే టికెట్లు కేటాయించాడు. కాంగ్రెస్ అభ్యర్ధి పరమేశ్వర్ రెడ్డి వసూల్ రాజా అని విమర్శించారు.

Also Read.. హెలికాప్టర్ లో కేసీఆర్‌తో పొన్నాల.. జనగామలోనే చేరిక.. బీసీ ఫుల్ ఖుషి

ఒక బైక్ మెకానిక్ వందల కోట్లకు ఎదగడానికి కారణం కార్పొరేటర్ గా ఉండి వసూల్ చేయడమేనని ఆరోపించారు. ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్ధి పరమేశ్వర్ రెడ్డి అక్రమాలను, వివిధ పోలీస్ స్టేషన్ లలో ఉన్న పలు కేసులను కార్యకర్తలు ఈ సందర్భంగా వివరించారు. బెదిరింపులకు, రౌడీఇజానికి మారుపేరు పరమేశ్వర్ రెడ్డి అని, ఎలా గెలుస్తాడో చూస్తామని జితేందర్ రెడ్డి, ఉప్పల్ వై.ఎస్.ఆర్, ఆర్.ఎల్.ఆర్ వర్గీయులు హెచ్చరించారు.

protest against revanth reddy in uppal

Latest News

More Articles