Wednesday, May 22, 2024

97.38 శాతం వ‌చ్చేసిన 2000 క‌రెన్సీ నోట్లు

spot_img

ముంబై: డిసెంబ‌ర్ 29వ తేదీ వ‌ర‌కు రూ.2000 క‌రెన్సీ నోట్లు 97.38 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వ‌చ్చిన‌ట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వెల్లడించింది.  2023 మే 19వ తేదీన లావాదేవీలను రద్దు చేసిన సమయంలో సుమారు 3.56 ల‌క్ష‌ల కోట్లు విలువ చేసే 2000 నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయి. ఇంకా 9,330 కోట్ల విలువైన నోట్లు ఇంకా చెలామ‌ణిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కాగా, 2000 క‌రెన్సీ నోట్లకు ఇంకా లీగ‌ల్ గుర్తింపు ఉన్న‌ద‌ని ఆర్బీఐ తాజాగా వెల్ల‌డించింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 7వ తేదీవ‌ర‌కు అన్ని బ్యాంకుల్లో రెండు వేల నోట్ల‌ను తీసుకోగా.. అక్టోబ‌ర్ 9వ తేదీ నుంచి ఆర్బీఐ ఆఫీసుల్లో మాత్రమే 2000 నోట్లను తీసుకుంటున్నారు. మరికొంద‌రు రెండు వేల నోట్ల‌ను ఇండియా పోస్టు ద్వారా ఇంకా పంపుతున్నారని, ఇంకొందరు బ్యాంక్ అకౌంట్లోలో జ‌మ చేస్తున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.

Latest News

More Articles