Friday, May 17, 2024

2023లో క్రికెట్‌ మజా.. జనవరి 3 నుంచే శ్రీలంక పర్యటన

spot_img

క్రికెట్ అభిమానులకు కొత్త సంవత్సరంలో మజాను అందించేందుకు టీమిండియా సన్నద్ధమైంది. జనవరి మూడో తేదీ నుంచే శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లకు సంబంధించిన స్క్వాడ్‌లను ఆయా క్రికెట్‌ బోర్డులు ప్రకటించాయి.

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య వ్యవహరిస్తాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ టీ20లకు దూరంగా ఉండి వన్డే సిరీస్‌లో ఆడతారు. టీ20లు రాత్రి 7 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. స్టార్‌ స్పోర్ట్స్‌, డిస్నీ – హాట్‌స్టార్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ను చూడవచ్చు.

టీ20 షెడ్యూల్  

  •  తొలి టీ20 మ్యాచ్‌: ముంబయి వేదికగా జనవరి 3
  •  రెండో టీ20 మ్యాచ్: పుణె వేదికగా జనవరి 5
  •  మూడో టీ20 మ్యాచ్‌: రాజ్‌కోట్ వేదికగా జనవరి 7

జట్లు

భారత్: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠీ, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌పటేల్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శివం మావి, ముకేశ్‌ కుమార్‌

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, డాసున్ శనక (కెప్టెన్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్, భానుక రాజపక్స, అషెన్ బండార, మహీశ్‌ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కాసున్ రజిత, దునిల్ వెల్లలాగే, ప్రమోద్‌ మదుషాన్, లాహిరు కుమార, నువాన్ తుషారా

వన్డే షెడ్యూల్  

  •  మొదటి వన్డే: గువాహటి వేదికగా జనవరి 10
  •  రెండో వన్డే: కోల్‌కతా వేదికగా జనవరి 12
  •  మూడో వన్డే: తిరువనంతపురం వేదికగా జనవరి 15

జట్లు

భారత్: రోహిత్‌శర్మ(కెప్టెన్), హార్దిక్‌ పాండ్య, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

శ్రీలంక: పాతుమ్‌ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, డాసున్ శనక (కెప్టెన్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, నువనిందు ఫెర్నాండో, చమిక కరుణరత్నె, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్,  అషెన్ బండార, మహీశ్‌ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కాసున్ రజిత, దునిల్ వెల్లలాగే, ప్రమోద్‌ మదుషాన్, లాహిరు కుమార, జెఫ్రే వండర్సే

Latest News

More Articles