Saturday, May 18, 2024

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 231 మంది ఖైదీల విడుదల

spot_img

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయనుంది. సత్ప్రర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భాగంగా జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఖైదీల శిక్షాకాలాన్ని తగ్గిస్తూ క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Read also: తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే

ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జైళ్లలో మంచి ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలు విడుదలకానున్నారు. జీవితకాల ఖైదీలు 212 మంది, జీవితేతర ఖైదీలు 19 మందిని అధికారులు విడుదల చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఖైదీల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఎంతోకాలంగా కుటుంబాలకు దూరమైన ఖైదీలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం రెండు విడతల్లో 400 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 231 మంది ఖైదీల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Latest News

More Articles