Friday, May 17, 2024

చెత్తకుప్పలో రూ. 25 కోట్లు.. నోరెళ్లబెట్టిన చెత్త ఏరుకునే వ్యక్తి

spot_img

అతను రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి. రోజూ మాదిరిగానే ఆ రోజు కూడా ఒక చెత్త కుప్ప దగ్గరికి వెళ్లాడు. అందులో ఒక బ్యాగు దొరికింది. తెరచి చూస్తే.. అందులో నోట్ల కట్టలున్నాయి. ఈ ఘటన బెంగుళూరులో ఈ నెల 3న వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందిన ఎస్‌కే సాల్మన్‌ బెంగళూరులో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఈ నెల 3న నాగవార రైల్వేస్టేషన్‌ పక్కన చెత్త ఏరుకుంటుండగా చెత్తకుప్పలో ఓ బ్యాగును చూశాడు. దానిపై యునైటెడ్‌ నేషన్స్‌ అనే ముద్ర ఉంది. కంగారు పడిన సాల్మన్ బ్యాగును అమృతహళ్లిలోని ఇంటికి తీసుకెళ్లి తెరిచి చూడగా 23 బండిళ్ల 30 లక్షల అమెరికన్‌ డాలర్ల నోట్ల కట్టలున్నాయి. వాటిని భారతీయ కరెన్సీలోకి మారిస్తే వాటి విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుంది.

Read Also: ఓటుకు నోటు కేసులో కాళ్లు పట్టుకుంటే బాబును వదిలేశారు

భయపడిన సాల్మన్‌.. రెండురోజుల తర్వాత ఈ విషయాన్ని స్వరాజ్‌ ఇండియా సామాజిక కార్యకర్తకు తెలపాడు. అతనితో కలిసి వెళ్లి నగర పోలీస్‌ కమిషనర్‌ దయానందకు చెప్పాడు. ఈ డాలర్లు నకిలీవని పోలీసులు భావిస్తున్నారు. తనిఖీ కోసం వాటిని నగరంలోని రిజర్వు బ్యాంకుకు పంపించారు. నగదు దొరికిన ప్రదేశంలో పోలీసులు తనిఖీలు చేశారు.

Latest News

More Articles