Sunday, May 19, 2024

 పుణెలో చిరుత దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి

spot_img

మ‌హారాష్ట్ర పుణె జిల్లాలోని జున్నార్ ఏరియాలో దారుణం జ‌రిగింది. ఓ పులి నాలుగేండ్ల బాలుడిని దాడి చేసి చంపింది. పుణెలో చిరుత పులి దాడి చేయడం ఈ ఏడాదిలో ఇది మూడో సారి.

జున్నార్ ఏరియాలోని అలే గ్రామ స‌మీపంలోని వ్య‌వ‌సాయ పొలంలో శివాన్ష్ భుజ్బాల్(4) అనే పిల్లాడు.. త‌న తాత‌తో క‌లిసి ఉన్నాడు. తాత వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకుంటున్న స‌మ‌యంలో పులి అక్క‌డ‌కు వ‌చ్చింది. ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన చిరుత‌.. అత‌న్ని ప‌క్క‌నే ఉన్న చెరుకు తోట‌లోకి లాక్కెళ్లింది.

పిల్లాడి అరుపులు విన్న రైతులు అక్క‌డికి ప‌రుగెత్తుకొచ్చారు. చిరుత నుంచి బాలుడిని త‌ప్పించేందుకు రైతులు తీవ్రంగా య‌త్నించారు. దీంతో చెరుకు తోట‌లో బాలుడిని వ‌దిలేసి పారిపోయింది పులి. ముఖం, మెడ‌, త‌ల‌పై తీవ్ర గాయాల‌వ‌డంతో బాలుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శివాన్ష్ చికిత్స పొందుతూ చనిపోయాడు.

ఇది కూడా చదవండి:కాంగ్రెస్ కు అధికారమిస్తే తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది

Latest News

More Articles