Saturday, May 18, 2024

కునో పార్కులో 5 చీటా పిల్లల జననం

spot_img

ఆశావహ ప్రాజెక్టులో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి మధ్య ప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ కు తీసుకువచ్చిన ఐదు ఏండ్ల చీటా గామిని ఐదు పిల్లలకు జన్మ ఇచ్చింది. ఈ విషయాన్ని ఇవాళ(ఆదివారం) కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. దీంతో భారత్‌లో జన్మించిన చీటా పిల్లల సంఖ్య13కు పెరిగింది. కునో పార్కులో పిల్లలతో సహా చీటాల సంఖ్య 26కు చేరుకున్నది. ‘హై ఫైవ్ కునో ! దక్షిణాఫ్రికాలోని స్వాలు కలహరి రిజర్వ్ నుంచి తీసుకువచ్చిన దాదాపు 5 ఏళ్ల ఆడ చీటా గామిని ఆదివారం ఐదు పిల్లలకు జన్మ ఇచ్చింది. వాటితో దేశంలో పుట్టిన పిల్లల సంఖ్య 13కు చేరుకుంది. భారత భూభాగంపై ఇది నాలుగవ చీటా సంతానం. దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీటాల్లో ఇది తొలి సంతానం’ అని మంత్రి యాదవ్ ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి.. నీలాగా ఆంధ్ర నాయకుల బూట్లు నాకి రాజకీయాల్లోకి రాలే

Latest News

More Articles