Saturday, May 4, 2024

ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలకు సాగు నీరు కరువు

spot_img

ప్రభుత్వ  నిర్లక్ష్యంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(ఆదివారం) ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం మారేడుపల్లి-ముంజం పల్లి గ్రామాల్లో పర్యటించి ఎండిపోతున్న పంటలను రైతులతో కలసి పరిశీలించారు. అధికారులు సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే పంటలు ఎండిపోవని అన్నారు.

ఎస్సారెస్పీ పంప్ హౌస్  ద్వారా నీళ్లు వస్తాయన్న ఆశతో ముంజంపల్లి, మారేడు పల్లి గ్రామాలకు చెందిన రైతులు 1800 ఎకరాల్లో వరి సాగు చేశారని , ప్రస్తుతం పొట్ట దశలో సాగునీరు అందడం లేదని తెలిపారు. కాలువ ద్వారా నీరు ఇవ్వని పరిస్థితుల్లో మారేడుపల్లి పక్కనే ఉన్న వేంనూర్ పంప్ హౌస్ నుంచి నంది రిజర్వాయర్ కు నీటిని తరలించే పైప్ లైన్ కు ఉన్న వాల్ ను విప్పి ఎస్సారెస్పీ 11 లెప్ట్‌ కాలువ లోకి వదిలి పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చిని ఆయన సూచించారు. ఇప్పటికే 300 ఎకరాల వరి పొట్ట దశలో ఎండిపోయి, బీటలు వారుతున్నాయన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో నంది రిజర్వాయర్ నుంచి రెండు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ను తవ్వి ఖిలావననర్తి దగ్గర ఎస్సారెస్పీ కలపాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కేసీఆర్‌ అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సహకారంతో 8.55 కోట్లు నిధులు మంజూరు చేశారని ఎన్నికలు రావడంతో పనులు జరగలేదన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీటి పారుదలపై స్పష్టత లేదని ఆరోపించారు కొప్పుల ఈశ్వర్.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం: భారత జాగృతి కమిటీలు అన్నీ రద్దు

Latest News

More Articles