Saturday, May 18, 2024

ఒక్కో రన్‎కు కోటి రూపాయలు తీసుకున్న కాస్ట్లీ ప్లేయర్

spot_img
  • రూ. 10 కోట్లకు పైగా తీసుకొని, పది మ్యాచులు కూడా ఆడని ప్లేయర్లు

రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను కట్టిపడేసిన ఐపీఎల్ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‎లో చెన్నై గెలిచి, ఐదోసారి కప్‎ను చేజిక్కించుకుంది. కాగా.. ఈ ఐపీఎల్ సీజన్‎లో కొందరు ఆటగాళ్లు అంచనాల్లేకుండా వచ్చి, అదరహో అనిపించారు. కానీ, కొందరు మాత్రం భారీ అంచనాలతో, భారీ ధరకు అమ్ముడుపోయి ఊసూరుమనిపించారు. ఈ రకం ఆటగాళ్లలో
బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‎లు ముందున్నారు.

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‎ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 16.25 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. స్టార్ ఆల్ రౌండర్ అనే ట్యాగ్.. అంతకుముందే ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటంతో స్టోక్స్ భారీ ధర పలికాడు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఐపీఎల్ కోసం భారత్‎కు వచ్చిన బెన్ స్టోక్స్ చేతులెత్తేశాడు. ఈ సీజన్‎లో స్టోక్స్ కేవలం రెండంటే రెండే మ్యాచులు ఆడి, కాలి నొప్పితో బెంచ్‎కే పరిమితమయ్యాడు. అయితే కనీసం ప్లే ఆఫ్స్ నాటికి గాయం నుంచి కోలుకుంటాడని చెన్నై ఓపిగ్గా ఎదురు చూసింది. కానీ తీరా ప్లే ఆఫ్స్ సమయానికి తాను యాషెస్‎కు ప్రిపేర్ కావాలంటూ ఇంగ్లండ్‎కు చెక్కేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య వచ్చే నెల జూన్ 16 నుంచి యాషెస్ ఆరంభం కానుంది.

బెన్ స్టోక్స్
ఈ సీజన్‎లో బెన్ స్టోక్స్ రెండు మ్యాచుల్లోనూ కలిపి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఒక ఓవర్ బౌలింగ్ చేసి, 18 పరుగులు సమర్పించుకున్నాడు. రూ. 16 కోట్ల ధర పలికిన ప్లేయర్ పట్టుమని 16 పరుగులు కూడా చేయకుండానే ఇంటికి వెళ్లిపోయాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ లెక్కన బెన్ స్టోక్స్ ఒక్కో పరుగుకు రూ. కోటి రూపాయలను అందుకున్నాడని విమర్శిస్తున్నారు.

వనిందు హసరంగా
ఆర్సీబీ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ ఈ సీజన్‌లో రూ. 10.75 కోట్లు అందుకున్నాడు. హసరంగ ఈ సీజన్‌లో ఆర్సీబీ తరపున ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పైగా వికెట్లు కూడా పెద్దగా తీసింది ఏమీ లేదు. కేవలం తొమ్మిది వికెట్లతో సరిపెట్టుకున్నాడు.

లాకీ ఫెర్గూసన్
కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున లాకీ ఫెర్గూసన్ మూడు మ్యాచ్‌లు ఆడాడు. ట్రేడ్ విండోలో కేకేఆర్ అతనిని రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో ఫెర్గూసన్ మూడు మ్యాచులు మాత్రమే ఆడాడు.

లియామ్ లివింగ్‌స్టోన్‌
లియామ్ లివింగ్‌స్టోన్‌ ఈ సీజన్‎లో రూ. 10 కోట్లకు పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన లివింగ్‌స్టోన్.. తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు.

అవేష్ ఖాన్‌
లక్నో సూపర్ జెయింట్స్ గత ఏడాది అవేష్ ఖాన్‌‎కు రూ. 10 కోట్లు చెల్లించింది. ఖాన్ ఆర్సీబీ మీద విజయవంతంగా ఆడినప్పటికీ, అంతగా రాణించలేకపోయాడు. ఈ సీజన్‎లో తొమ్మిది గేమ్‌లు ఆడిన ఖాన్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

కోట్లకు కోట్లు తీసుకొని సీజన్ మధ్యలోనే వెళ్లిపోవడంతో అభిమానులలో అసహనం పెరిగిపోయింది. ఇంగ్లండ్ ప్లేయర్లను వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‎లోకి తీసుకోకూడదంటూ మరికొందరు అభిమానులు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

Latest News

More Articles